ఖరీదైన కాసర

ABN , First Publish Date - 2022-07-07T06:09:39+05:30 IST

ప్రత్యేకంగా పండించరు. వర్షం కురవగానే అవే మొలకెత్తుతాయి. తీగలు అల్లుకుంటాయి. చిన్న చిన్న కాయలు కాస్తాయి.

ఖరీదైన కాసర
రాసిగా పోసిన చిన్న కాకరకాయలు

ప్రత్యేకంగా పండించరు. వర్షం కురవగానే అవే మొలకెత్తుతాయి. తీగలు అల్లుకుంటాయి. చిన్న చిన్న కాయలు కాస్తాయి. నల్లరేగడి భూముల్లో మాత్రమే కనిపించే వీటిని చిన్న కాకరకాయలు అని కొందరు, కాసర కాయలు అని కొందరు పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాలవారు వీటిని సేకరించి.. సమీప పట్టణాల్లో అమ్ముతుంటారు. కర్ణాటక సరిహద్దుల్లో ఎక్కువగా లభిస్తాయి. అక్కడి నుంచి కూడా కొందరు భారీగా సేకరించి మార్కెట్లో అమ్ముతారు. చిన్నగానే ఉన్నా.. ఖరీదైన కాయలు ఇవి. గుత్తి పట్టణంలో కిలో రూ.200 ప్రకారం విక్రయిస్తున్నారు. సీజనలో మాత్రమే లభించే చిన్న కాకరకాయలు ఆరోగ్యానికి మంచివని పెద్దలు చెబుతారు. వేపుడు చేసి.. జొన్న రొట్టెలో ఇష్టంగా తింటారు.- గుత్తి రూరల్‌ 

Read more