విద్యుదాఘాతంతో ఉపాధి టీఏ మృతి

ABN , First Publish Date - 2022-12-13T00:02:08+05:30 IST

మండలంలో రేకలకుంట గ్రామానికి చెం దిన టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ) నాగరాజు(45) సోమవారం ఉదయం విద్యుత షాక్‌తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

విద్యుదాఘాతంతో ఉపాధి టీఏ మృతి
విద్యుత షాక్‌తో మృతి చెందిన నాగరాజు

మడకశిర రూరల్‌, డిసెంబరు 12: మండలంలో రేకలకుంట గ్రామానికి చెం దిన టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ) నాగరాజు(45) సోమవారం ఉదయం విద్యుత షాక్‌తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రేకలకుంట గ్రామానికి చెందిన నాగరాజు చెన్నేకొత్తపల్లి మండలంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. స్వగ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద తొట్టికి వేసిన సింగల్‌ ఫేస్‌ మోటారు ద్వారా నీరు వస్తున్నాయో లేదో అని పరిశీలించాడు. ఈక్రమంలో మోటారుకు అమర్చిన విద్యుత వైర్‌ తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని మడకశిర ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారై ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-13T00:02:08+05:30 IST

Read more