-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Ecrop should be done 100 percent Collector Nagalakshmi-NGTS-AndhraPradesh
-
ఈ-క్రాప్ వందశాతం చేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి
ABN , First Publish Date - 2022-09-17T06:02:21+05:30 IST
ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా, ఈ-క్రాప్ బుకింగ్ వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు

అనంతపురం టౌన, సెప్టెంబరు 16: ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా, ఈ-క్రాప్ బుకింగ్ వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స హాల్‌లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖరీ్‌ఫలో వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 10.53 లక్షల ఎకరాల్లో సాగుచేశారని అన్నారు. ఇప్పటి వరకు 9.98 లక్షల ఎకరాల్లో పంటలకు ఈ-క్రాప్ నమోదు చేశారని వెల్లడించారు. ఇంకా 5 శాతం పెండింగ్‌లో ఉందని, గడువులోగా వందశాతం నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు ఏ పంట, ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రబీ సీజన దగ్గరకొస్తోందని, అన్ని రకాలుగా రైతులకు సహకారం అందించేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, మందులు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. విత్తనాలకు సోమవారంలోగా ఇండెంట్ పంపించాలని ఆదేశించారు. సమీక్షలో జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, జేసీ కేతనగార్గ్, ఏడీసీసీ బ్యాంక్ చైర్‌పర్సన నిఖిత, జేడీఏ చంద్రానాయక్, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.