దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T05:19:12+05:30 IST

పట్టణంలోని పలు దేవాలయాల్లో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభ మ య్యాయి. ఆలయాలను విద్యుత దీపాలతో అలంకరించారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ధర్మవరం వాసవీగుడిలో పార్వతీదేవి అలంకరణ

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు26: పట్టణంలోని పలు దేవాలయాల్లో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభ మ య్యాయి. ఆలయాలను విద్యుత దీపాలతో అలంకరించారు. అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణవీధిలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి దేవిగా, అంజుమనసర్కిల్‌లోని దుర్గమ్మ పార్వతిదేవిగా, కొత్తపేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో రాజరా జేశ్వరిగా, శ్రీనివాసనగర్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మత్స్యావతారంగా, వాసవీమాత ఆలయంలో పార్వతిదేవిగా, గాంధీనగర్‌లోని చౌడమ్మ ఆలయంలో గౌరిదేవిగా అలంకరణ చేశారు. 

పుట్టపర్తిరూరల్‌ : దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా మండల వ్యాప్తంగా ఆమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మొదటి రో జు ప్రశాంతి నిలయంలోని గాయత్రి అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా, కోవెలగుట్టపల్లి దుర్గాదేవి  స్వర్ణకవచఅలంకరణలో దర్శనమిచ్చారు.  

బత్తలపల్లి: మండలకేంద్రమైన బత్తలపల్లి ఓంకారేశ్వరస్వామి దేవాల యంలో బాలత్రిపురసుందరిదేవిగా, ధర్మవరంరోడ్డులో ఏర్పాటుచేసిన దుర్గాదేవి విగ్రహప్రతిమ దుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చారు.  

నల్లమాడ: మండలంలోని కొత్తబావి గంగమ్మ ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి అలంకరంలో భక్తులకు దర్శనమిచ్చారు. 

కదిరి: పట్టణంలోని వివిధ దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. మరకత మహాలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మిగా, చౌడేశ్వరీదేవి రాజరాజేశ్వరీగా, మల్లాలమ్మ  మహాలక్ష్మిగా, కన్యకాపరమేశ్వరి రాజరాజేశ్వరీగా భక్తులకు దర్శనమిచ్చారు. 

ఓబుళదేవరచెరువు: మండలపరిధిలోని తిప్పేపల్లిలో చౌడేశ్వరీ దేవాలయంలో సోమవారంరాత్రి ప్రత్యేక అలంకరణ, పూజలు చేశారు. కుట్లవారిపల్లి, తిప్పేపల్లికి చెందిన సర్దా, రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. 


Updated Date - 2022-09-27T05:19:12+05:30 IST