ఘనంగా దుర్గాష్టమి

ABN , First Publish Date - 2022-10-04T05:12:54+05:30 IST

జిల్లావ్యాప్తంగా సోమవారం దుర్గాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోరంట్లలో దేవాంగులు అమ్మవారి కలశాన్ని చిత్రావతి నది వద్ద నుంచి ప్రధాన రహదారిపై ఊరేగింపుగా తీసుకువచ్చా రు.

ఘనంగా దుర్గాష్టమి
గోరంట్లలో దుర్గామాత అలంకరణలో వాసవీ

కోలాహలంగా అమ్మవారి ఆలయాలు


గోరంట్ల, అక్టోబరు 3: జిల్లావ్యాప్తంగా సోమవారం దుర్గాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోరంట్లలో దేవాంగులు అమ్మవారి కలశాన్ని చిత్రావతి నది వద్ద నుంచి ప్రధాన రహదారిపై ఊరేగింపుగా తీసుకువచ్చా రు. స్తోత్రాలతో స్థుతిస్తూ ఆరాధించారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, వరలక్ష్మీ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి కలశాన్ని చౌడేశ్వరీ కాలనీలోని కళ్యాణమండపం వరకు ఊరేగించారు. అనంతరం చౌడేశ్వరీ అ మ్మవారిని అందంగా అలంకరించి కుంకుమార్చన, విశేష పూజలు చేశారు. చక్కభజన, అన్నదాన కార్యక్రమం జరిగింది. పూజల్లో దేవాంగ సంఘం నా యకులు జౌళి కిష్టప్ప, మాజీ సర్పంచలు నిమ్మల నిర్మలమ్మ, నిమ్మల చం ద్రశేఖర్‌, సత్యవాణి దంపతులు, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, పలువురు దేవాంగులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని వాసవీమాత,  చౌడేశ్వరీదేవి, గుమ్మయ్యగారిపల్లిలోని మారెమ్మ దేవతలు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 


సోమందేపల్లి: స్థానిక కన్యకాపరమేశ్వరీ దేవి, అంబాభవానీ ఆలయా ల్లో దుర్గామాతగా అమ్మవార్లు దర్శనమిచ్చారు. పాతూరు చౌడేశ్వరీదేవి, పె ద్దమ్మ, మరిగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


హిందూపురం అర్బన: ఎరుకుల కులస్థుల ఆరాధ్యదైవం యల్లమ్మ త ల్లి ఆలయంలో జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణంలో ని చిన్న మార్కెట్‌ నుంచి నింకంపల్లి రోడ్డులోని యల్లమ్మ ఆలయం వరకు  మహిళలు జ్యోతులను ఊరేగించి, అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భం గా మూలవిరాట్‌ను వేపాకు, నిమ్మకాయలు, పూలతో అలంకరించారు. అ దేవిధంగా పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ, జలదుర్గమ్మ ఆలయాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. నింకంపల్లి రోడ్డు యల్లమ్మ, కొ ల్హాపురమ్మ దేవతలకు పుష్పాలంకరణ చేశారు. సూరప్ప కట్ట బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారు కాళికాదేవిగా దర్శనమిచ్చారు. పులమతి రోడ్డు రాజరాజేశ్వరీదేవిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. మధుగి రి మారియమ్మ ఆలయంలో దుర్గాదేవిగా, విజయనగర్‌ కాలనీ చౌడేశ్వరీ అ మ్మవారు కాళికామాతగా భక్తులకు దర్శనమిచ్చారు.


గుడిబండ: మండలంలోని గుడిబండ తుమ్మల మారెమ్మ, ఎస్‌ రాయాపురం మారెమ్మ ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి, వి శేష పూజలు చేశారు. కొంకల్లు ఆంజనేయస్వామి, ఎస్‌ఎ్‌సగుండ్లు ఏడుమం ది అక్కదేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.  


మడకశిర టౌన: పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ, కొల్లాపురమ్మ, వడుసలమ్మ, గంగాభవాని, ఊరిమారమ్మ ఆలయాల్లో  విశేష అలంకరణ, పూజ లు కొనసాగాయి. ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి.


పెనుకొండ: స్థానిక లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయంలో స్వామివారిని నరసింహ అవతార రూపంలో, వాసవీకన్యకాపరమేశ్వరి, కాళీమాతను దుర్గాదేవిగా అలంకరించారు. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


లేపాక్షి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్థాని క దుర్గావీరభద్ర స్వామి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, సప్తసెతి పారాయణం, రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, విశేష పూజలు నిర్వహించారు. తొమ్మిదోరోజు మంగళవారం మ హర్నవమి ఆయుధాల పూజ చేస్తామని అర్చకులు తెలిపారు. 


అగళి: మండలంలోని కొమరేపల్లి బీరలింగేశ్వరస్వామి, మధూడి వీరభద్రేశ్వరస్వామి, నరసంబూది లక్ష్మీరంగనాథస్వామి, అగళి శంకరేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేకపూజలు, ఆకుపూజలు నిర్వహించారు. ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.


రొద్దం: స్థానిక రుద్రపాదాశ్రమం, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, ఆర్‌ మరువపల్లిలోని కోన మల్లేశ్వరస్వామి, రేణుకా యల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు.


Read more