డీఎస్పీ తాడిపత్రిని భ్రష్టుపట్టిస్తున్నాడు..!

ABN , First Publish Date - 2022-10-01T05:17:58+05:30 IST

తాడిపత్రిని డీఎస్పీ చైతన్య భ్రష్టుప ట్టిస్తున్నాడని పోలీసుశాఖలో ఒక చీడపురుగుగా తయారయ్యాడని టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభా కర్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

డీఎస్పీ తాడిపత్రిని భ్రష్టుపట్టిస్తున్నాడు..!
మాట్లాడుతున్న జేసీపీఆర్‌

మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి

  తాడిపత్రి, సెప్టెంబరు 30: తాడిపత్రిని డీఎస్పీ చైతన్య భ్రష్టుప ట్టిస్తున్నాడని పోలీసుశాఖలో ఒక చీడపురుగుగా తయారయ్యాడని టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభా కర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. స్థానిక నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లా డుతూ డీఎస్పీ చైతన్య అవినీతికి పరాకాష్టగా మారాడన్నారు. ఇతని కొలిగ్స్‌గా ఉన్న కదిరి, పెనుకొండ డీఎస్పీలకు రాని అవినీతి ఆరోపణలు ఏకపక్ష ధోరణి, నియంతృత్వ పోకడలు ఇతనికి వచ్చాయన్నారు. గ్రానైట్‌ గుండ్ల వ్యవహారంలో ఎస్‌ఐ రామును మీడియేటర్‌గా చేసుకొని రూ. లక్షలకు లక్షలు తీసు కున్నాడని విమర్శించారు. పట్టణంలోని సంజీవనగర్‌లో 4వరోడ్డులో ఉంటున్న చుక్కలూరుకు చెందిన అక్క, తమ్ముడు గొడవపై డబుల్‌ డిజిట్‌ డబ్బును తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వ యంగా ఆమె తనకు అత్త వరుస అవుతుందన్నారు. మడ్డిపల్లి క్రి ష్ణారెడ్డికి కడపరోడ్డులో ఉన్న స్థలం వివాదంలో కూడా పె ద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాడన్నారు. ఈ మధ్యకాలంలో సొంత ప్రాంతానికి పెద్దఎత్తున గ్రానైట్‌ను తరలించాడని అందులో కొంత భాగం మాత్రమే చెల్లించాడన్నారు. డీఎస్పీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా మల్లపురాజుపేట అని ఒక డీఎస్పీగా ఉండి ఇంత మొత్తంలో డబ్బులు సంపాదించడం సాధ్యమా అని అక్కడివారు చెప్పడం ఆశ్చర్యపరిచిందన్నారు. డీఎస్పీ తండ్రి సాదాసీదా ఉద్యోగి అని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చదివించాడన్నారు. ఆయన తమ్ముడు రియల్‌ ఎస్టేట్‌తోపాటు మత్స్య వ్యాపారం చేస్తున్నాడన్నారు. ఆ వ్యాపారాలకు కావాల్సిన పెద్దఎత్తున పెట్టుబడి ఎలా వచ్చిందని స్థానికులే అబ్బుర పడుతున్నారన్నారు. తాను నెల్లూరు జిల్లాలో వివాహం చేసుకోవడం వల్ల అక్కడున్న సంబంధాల వల్ల డీఎస్పీపై విచారణ చేయించడం వల్ల ఈ విషయాలు బహిర్గతం అయ్యాయన్నారు. డీఎస్పీ తన కొడుకు బారసాలను ఆడంబరంగా నిర్వహిం చడమే కాకుండా పో లీసు అధికారులను, సిబ్బందిని సొంత ప్రాంతానికి రప్పిం చుకున్నాడన్నారు. తనకు పోలీసుశాఖను కించపరచడం ఉద్దేశం కాదని అందులోని అవినీతి చీడ పురుగైన డీఎస్పీని మాత్రమే టార్గెట్‌ చేసుకొని మాట్లాడుతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. సబ్‌ డివిజన్‌లో నెలనెలా ముడుపులు ముట్టుతుండడం వాస్తవం కాదా అని డీఎస్పీని ప్రశ్నించారు. ఈ అవినీతి అక్రమాలను బాధ్యతగల మున్సిపల్‌ చైర్మన్‌గా తాను పోలీసుశాఖలో ఉన్నత విధులను నిర్వ ర్తిస్తున్న డీఎస్పీ చైతన్యపై చెబుతున్నానంటే అందులో వాస్తవాలు ఉన్నాయని గ్రహించాలన్నారు. నేను మాట్లాడిన మాటలకు సంబం ధించిన ఆధారాలు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు పంపడం జరుగుతుందని వాటిని ఆధారంగా చేసుకొని ఏ చర్యలు తీసుకుంటారో నిర్ణయిం చుకోవాలన్నారు. ప్రతిరోజూ ఎమ్మెల్యే ఇంటికి డీఎస్పీ ఎందుకు వెళుతున్నాడో ఆయనకే తెలియా లన్నారు. వీటికి సంబంధించిన పుటేజీలు తనవద్ద ఉన్నాయన్నారు. టీడీపీ కౌన్సిలర్లపై జరిగిన దాడిని నిరసిస్తూ తాను చేపట్టిన మౌన ప్రదర్శనలో డీఎస్పీకి మద్దతుగా పెద్దవడుగూరు ఎస్‌ఐ రాజశేఖ ర్‌రెడ్డితోపాటు మరికొం దరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిం చారని, అసభ్యకరంగా మాట్లాడారని తమవారిపై దాడిచేసేందుకు కూడా సిద్ధమ య్యారన్నారు. ఏం చూసుకొని వారు అలా చెలరే గిపోతున్నారో తన కు తెలియడం లేదని భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని వారిని హెచ్చరించారు. 


Read more