డీఎ్‌సఏ ఆఫీస్‌ ఖాళీ

ABN , First Publish Date - 2022-07-05T06:22:19+05:30 IST

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ (డీఎ్‌సఏ) నుంచి పలువురు శిక్షకులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు.

డీఎ్‌సఏ ఆఫీస్‌ ఖాళీ

బదిలీల్లో క్రీడాశాఖ వింత వైఖరి


అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై 4: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ (డీఎ్‌సఏ) నుంచి పలువురు శిక్షకులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. శాప్‌ వైస్‌ చైర్మన, ఎండీ ప్రభాకర్‌రెడ్డి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అశోక్‌ నగర్‌లో ఉన్న డీఎస్‌ఏలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దేవమణిను విజయవాడలోని శాప్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. బాక్సింగ్‌ కోచ ఓం ప్రకా్‌షను, వాలీబాల్‌ కోచ కిశోర్‌కుమార్‌ను, టేబుల్‌టెన్నిస్‌ కోచ ధనుంజయరెడ్డిని, హాకీకోచ హస్సేనను, జూడో కోచ మహ్మద్‌ అలీని, నార్పలలో ఉన్న రెజ్లింగ్‌ కోచ రాఘవేంద్రను శ్రీసత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు. పులివెందులలో ఉన్న కోచ చంద్రశేఖర్‌ను నార్పలకు బదిలీ చేశారు. డీఎ్‌సఏ కార్యాలయంలో ఉన్న ఒకే ఒక ఉద్యోగిని కూడా శాప్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో ఆఫీస్‌ మొత్తం ఖాళీ అయ్యింది. ఇక్కడికి ఒక్క ఉద్యోగిని కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఇక్కడ ఉన్న 10 మంది శిక్షకులలో ఐదుగురిని బదిలీ చేసి, వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి ఒక్కరిని ఇచ్చారు.  ఇప్పటికే సిబ్బంది, శిక్షకులు లేక అల్లాడుతున్న డీఎ్‌సఏకి.. శాప్‌ తీరు మింగుడు పడటం లేదు. జిల్లా క్రీడా, యువజన సంక్షేమశాఖ అధికారులు దీనిపై నోరు మెదిపే ధైర్యం చేయడం లేదు. Read more