ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకెన డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-07-18T06:01:29+05:30 IST

తాగుతున్నారు.. ఆపై రోడ్లపైకి వస్తున్నారు. అదే మత్తులో వాహనాలు నడుపుతూ నానా వీరంగా సృష్టిస్తున్నారు. అంతలోనే పోలీసులకు అడ్డంగా దొరికి కేసులపాలవుతున్నారు.

ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకెన డ్రైవ్‌

తాగి.. రోడ్లపై వీరంగం - ఆపై అడ్డదిడ్డంగా డ్రైవింగ్‌


చిలమత్తూరు, జూలై 17: తాగుతున్నారు.. ఆపై రోడ్లపైకి వస్తున్నారు. అదే మత్తులో వాహనాలు నడుపుతూ నానా వీరంగా సృష్టిస్తున్నారు. అంతలోనే పోలీసులకు అడ్డంగా దొరికి కేసులపాలవుతున్నారు. ఇది మండలంలో మద్యానికి అలవాటు పడిన పలువురు యువత తీరు. మండలంలో గత ఆరు నెలల కాలంలో 25 వరకు డ్రంకెన డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా యువకులే ఉండటం విశేషం. ప్రధానంగా మండలానికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని బాగేపల్లి నుంచి మద్యం తాగి వస్తూ కొడికొండ చెక్‌పోస్టులో పోలీసులకు పట్టుబడుతున్నారు. యువత స్నే హితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ మద్యం తాగి, ద్విచక్రవాహనాను నడుపుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమాదాలకు కారణమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం తాగడంతో పాటు పరిమితికి మించి వేగంగా వాహనాలను నడపడం, ఎదురుగా వస్తున్న వారిని, రోడ్డు దాటుతున్న వారిని గమనించకుండా దూసుకుపోవ డం వంటి వాటితో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 


 కొవిడ్‌తో ఆగిన డ్రంకెన డ్రైవ్‌ పరీక్షలు

గత రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా రహదారుల్లో డ్రంకెన డ్రైవ్‌ పరీక్షలను పోలీసులు ఆపేశారు. ఇదే అదనుగా మద్యానికి అలవాటు ప డిన వారు కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లి పీకల దాకా తాగి వాహనా లు నడుపుకుంటూ ఇళ్లకు అతికష్టం మీద చేరుకుంటున్నారు. అయి నా ఊగుతూ వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇటీవలే ప్రభు త్వం కొవిడ్‌ నిబంఽధనలు సడలించడంతో త్వరలో డ్రంకెన డ్రైవ్‌ పరీక్షలు యధాతథంగా కొనసాగుతాయని పోలీసులు పేర్కొంటున్నారు. 


పకడ్బందీగా కేసుల నమోదు..

శ్రీనివాసులు, ఎస్‌ఐ  

మద్యం తాగి వాహనాలు నడపడమంటే ఎదుటి వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది. మద్యం తాగి వాహనాలు న డిపితే వారిపై మోటార్‌ వెహికల్‌ 185 చట్టం ప్రకారం రూ.5 వేల జరిమానా, వారం పాటు జైలు శిక్ష ఉంటుంది. కొందరికి రెండు శిక్ష లు అమలుకావచ్చు. ద్విచక్రవాహనదారులకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్‌ ఇస్తూ రోడ్డు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటు న్నాం. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాన్ని ఇచ్చిన యజమానిపై కేసులు నమోదు చేస్తాం. కొంతకాలంగా కోవిడ్‌ కారణంగా డ్రంకెన డ్రైవ్‌ పరీక్షలకు కొంత విరామం ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ రహదారులపై మందుబాబుల భరతం పట్టడానికి డ్రంకెన డ్రైవ్‌ పరీక్షలను నిర్వహిస్తాం. 


Read more