ముంచిన వాన

ABN , First Publish Date - 2022-08-02T05:08:43+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వాన దంచేసింది. పంట పొలాలు నీట మునిగాయి. చెరువులకు జలకళ సంతరించుకుంది. వాగులు పొంగిపొర్లాయి.

ముంచిన వాన
మడకశిర మండలంలో నీటిలో మునిగిన మొక్కజొన్న పంట

హిందూపురంఅర్బన/గుడిబండ/పరిగి/మడకశిరటౌన/లేపాక్షి/ అమరాపురం/మడకశిర రూరల్‌, ఆగస్టు 1: జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వాన దంచేసింది. పంట పొలాలు నీట మునిగాయి. చెరువులకు జలకళ సంతరించుకుంది. వాగులు పొంగిపొర్లాయి. హిందూపురంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల లో నీరు చేరి పాదచారులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు. డ్రైనేజీలు, వ ర్షపు నీరు ఏకం కావడంతో దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నింకంపల్లి రో డ్డు, హౌసింగ్‌బోర్డు కాలనీ, అమృతమహాల్‌రోడ్డు, ఆర్టీసీ కాలనీ, హస్నాబా ద్‌ ప్రాంతాలు నీటి మడుగులను తలపించాయి. గుడిబండ మండలం ము దిగుబ్బ, గుడిబండ, కరేకెర గ్రామాల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పరిగి మండలం శాసనకోట ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న కాద్ర ప్ప, ఈశ్వరమ్మలకు చెందిన మట్టి మిద్దెలు నేలకూలాయి. సామగ్రి ధ్వం సం కాగా, ప్రాణనష్టం జరగలేదు.  మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా 70 శాతం పైగా చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. మడకశిర చెరువు మరు వ పారింది. పట్టణంలోని మారుతీ నగర్‌, రాజీవ్‌గాంధీ సర్కిల్‌ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాగనకుంట సమీప చిన్న వంక గట్లు తెగడంతో వర్షపు నీరంతా కాలనీలోకి చొరబడ్డాయి. ఆదివారం రాత్రి మడకశిర మండలంలో 88.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దారు ఆనంద్‌కమార్‌ తెలిపారు. రొళ్ళలో 22.4, గుడిబండ లో 17.2, అగళింలో 12.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. లేపాక్షి మండలం బిసలమానేపల్లి పంచాయతీ ఓబుళాపురంలో తొమ్మిది ఎకరాల్లో సాగుచేసిన చెరుకుతోట నే లమట్టమైంది. రూ.7 లక్షల పెట్టుబడి నీటిపాలైందని బాధిత రైతు వేణుగోపాల్‌రెడ్డి వాపోయారు. 


అమరాపురం మండలంలో 16.8మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ నరేష్‌ కుమార్‌ తెలిపారు. ఐదేళ్లలో ఇది రికార్డు అన్నారు. పలు చెక్‌డ్యామ్‌లు, కుంటలు, వాగులు, చెరువులకు నీరు చేరడం తో రైతులు హర్షం వ్యక్తంచేశారు. మడకశిర మండలంలో భారీవర్షాలతో అ పార పంటనష్టం వాటిల్లింది. ఛత్రం, మడకశిర, హరేసముద్రం, ఆమిదాలగొంది చెరువులు నిండి మరువ పారాయి. రంగాపురం, ఆర్‌ అనంతపురం గ్రామాల్లోని ఇళ్ళలోకి నీరు చేరాయి. రంగాపురం వంతెన దెబ్బతిని రాకపోక లు నిలిచిపోయాయి. పాఠశాలలోకి నీరుచేరడంతో స్కూల్‌కు సెలవు ప్రకటించారు. చెరవు నీరు ఉధృతంగా పంట పొలాల్లో ప్రవహించడంతో దిగు వన ఉన్న ఈచలేడి, రంగాపురం, ఆర్‌ అనంతపురం గ్రామాల్లో 80 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసా య అధికారి వీరనరేష్‌ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. జమ్మానిపల్లి, గోవిందాపుం వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మడకశికు చెందిన వృద్ధుడు వ్యాపారం కోసం గౌడనహళ్ళి వెళ్ళివస్తుండగా వంకలోకి దిగి ఇబ్బందులు పడ్డాడు. గమనించిన స్థానికులు వంక దాటించారు.   ఆర్‌ అనంతపుం-పెరుగొండ ప్రధాన రహదారిలో వంక రోడ్డుపై ప్రవహిస్తుడడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.


Read more