డీఆర్‌డీఏ డీపీఎం ఆత్మహత్య కేసు... పోలీసుల అదుపులో ఏడుగురు

ABN , First Publish Date - 2022-07-08T04:59:20+05:30 IST

డీఆర్‌డీఏ డిస్ర్టిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌(డీపీఎం)డాక్టర్‌ రాము ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

డీఆర్‌డీఏ డీపీఎం ఆత్మహత్య కేసు... పోలీసుల అదుపులో ఏడుగురు

అనంతపురం క్రైం, జూలై 7: డీఆర్‌డీఏ డిస్ర్టిక్ట్‌ ప్రాజెక్టు మేనేజర్‌(డీపీఎం)డాక్టర్‌ రాము ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల కిందట పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలోని అతిథిగృహంలో రాము ఉరివేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన రాసిన సూసైడ్‌ నోట్‌, మాట్లాడ్సిన ఫోన కాల్స్‌ ఆధారంగా తొలుత ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి మరో ఇద్దరిని విచారణ నిమిత్తం రప్పించినట్లు తెలిసింది. వారితో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా రూ.50లక్షల డిమాండ్‌తో బ్లాక్‌మెయిల్‌ చేసిన వారినే విచారించినట్లు సమాచారం. బిజినె్‌సలో మోసం చేసిన వారు ఎవరు..? డబ్బు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినవారెవరు...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more