బాదుడు ప్రభుత్వాన్ని సాగనంపండి

ABN , First Publish Date - 2022-09-25T05:20:35+05:30 IST

ప్రజలపై వరుసగా ధరలను పెంచుతూ బాదేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు హరినాథ్‌ గౌడ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ బర్దీవలి పేర్కొన్నారు.

బాదుడు ప్రభుత్వాన్ని సాగనంపండి

 గుత్తిరూరల్‌,సెప్టెంబరు 24: ప్రజలపై వరుసగా ధరలను పెంచుతూ బాదేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు హరినాథ్‌ గౌడ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ బర్దీవలి పేర్కొన్నారు. శనివారం మండలంలోని యర్రగుడి గ్రామం లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పరిపాలన చేతకాక అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. పెంచిన విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టౌన్‌ బ్యాం కు అధ్యక్షుడు జిలాన్‌, టీడీపీ నాయకులు వీరేష్‌ రవిశంకర్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, రామస్వామి, శీనివాస్‌, నారాయనస్వామి, అంజీ, అగ్గిరా ముడు, కదిరెప్ప కిట్ట, హరి తదితరులు పాల్గొన్నారు.


Read more