అధైర్యపడకండి అండగా ఉంటాం: పల్లె

ABN , First Publish Date - 2022-11-24T23:51:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయ కులు, అభి మానులు ఆఽధైర్య పడకండి... పార్టీ, నేను అండగా ఉంటామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

అధైర్యపడకండి అండగా ఉంటాం: పల్లె

ఓబుళదేవర చెరువు, నవంబరు 24: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయ కులు, అభి మానులు ఆఽధైర్య పడకండి... పార్టీ, నేను అండగా ఉంటామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, ఆపదలో ఉన్న కార్యకర్తలను పలకరించి, తనవంతు ఆర్థికసాయం అందించారు. చింతమానుపల్లిలో మృతిచెందిన ఇందురి రామచంద్రప్పనాయుడు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మల్లెవాండ్లపల్లికి చెందిన అశోక్‌ తల్లిదండ్రులను పరామర్శించారు. పాడి ఆవును కోల్పోయిన కొండకమర్ల గ్రామానికి చెందిన భూపతి శ్రీనివాసులును, అనారోగ్యంతో బాధపడుతున్న బడిశం నరసిం హులు, రహంతుల్లాను పరామర్శించారు. వారికి తనవంతుగా రూ. 5వేలు చొప్పున ఆర్థికసాయం అందించారు. సాఈశ్వరీమాల ధరించిన ఐదుగురు మహిళలను పలుకరించి ఆర్థికసాయం చేశారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీఅభ్యర్థిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విఽధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు జాకీర్‌ అహమ్మద్‌, పొగాకు షబ్బీర్‌అహమ్మద్‌, బడిశం రామాంజనేయులు, జయచంద్ర, మండలాధ్యక్షుడు కొండే ఈశ్వరయ్య, రాజారెడ్డి, గంగాద్రి, ఆంజనేయులు, చండ్రాయుడు, పొగాకు షానూ, బడిశం సురేష్‌, నాయకులు సుకేష్‌నాయుడు, వినోద్‌నాయుడు, మహేష్‌నాయుడు, బూదిలి ఓబులరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-24T23:51:23+05:30 IST

Read more