-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Do you call this a secretariat-MRGS-AndhraPradesh
-
దీన్ని సచివాలయం అంటారా..?
ABN , First Publish Date - 2022-10-12T05:23:55+05:30 IST
‘అసౌకర్యాల నడుమ ఉన్న ఈ కా ర్యాలయాన్ని గ్రామ సచివాలయం అంటారా? ఇలాంటి ఇరుకైన గది లో ఎవరైనా కార్యాలయం ఏర్పాటుచేస్తారా? కనీసం ప్రజలు వచ్చి పోయేందుకు కూడా వీలు లేదు. ఇలాంటి చోట సచివాలయాన్ని ఎ లా ఏర్పాటు చేశారు?’ అంటూ కలెక్టర్ బసంత కుమార్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరుకు గదిలో మరవకొత్తపల్లి కార్యాలయ నిర్వహణ
తనిఖీలో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్
చిలమత్తూరు, అక్టోబరు 11: ‘అసౌకర్యాల నడుమ ఉన్న ఈ కా ర్యాలయాన్ని గ్రామ సచివాలయం అంటారా? ఇలాంటి ఇరుకైన గది లో ఎవరైనా కార్యాలయం ఏర్పాటుచేస్తారా? కనీసం ప్రజలు వచ్చి పోయేందుకు కూడా వీలు లేదు. ఇలాంటి చోట సచివాలయాన్ని ఎ లా ఏర్పాటు చేశారు?’ అంటూ కలెక్టర్ బసంత కుమార్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మండలంలోని మరవకొత్తపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనతో పాటు ఎంపీడీఓ రామ్‌కుమార్, కార్యదర్శి భాస్కర్ ఉన్నా రు. సచివాలయానికి సొంత భవనం లేకపోవడంతో అక్కడ అద్దె భ వనంలో నిర్వహిస్తున్నారు. ఆ భవనం ఏమాత్రం సౌకర్యంగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం కూర్చోవడానికి కూ డా స్థలం లేదని, ఇక ప్రజలకు సేవలు ఎలా అందిస్తారో అర్థం కావ డం లేదని అసహనం వ్యక్తంచేశారు. ఏదైనా మంచి భవనం చూసి సచివాలయాన్ని మార్చాలని ఆదేశించారు. అనంతరం ప్రజలకు ఇం తరవకు సచివాలయం ద్వారా అందించిన సేవల వివరాలను ఉద్యోగులతో అడిగి తెలుసుకున్నారు. రోజూ ఎన్ని సేవలు అందిస్తున్నా రు? ఎలాంటి సేవల కోసం ప్రజలు ఎక్కువగా వస్తున్నారు? విషయాలపై ఆరా తీసారు. రికార్డులను పరిశీలించి, ప్రజలకు సేవలు అందివ్వడంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
లేపాక్షిలో పర్యటన
లేపాక్షి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన ఈనెల 16న లే పాక్షికి వస్తారన్న సమాచారంతో, కలెక్టర్ బసంతకుమార్ మంగళవా రం స్థానికంగా పర్యటించారు. ఆలయాన్ని సందర్శించి, మహాత్మా జ్యోతిబాపూలే, జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్లాంటేషనను పరి శీలించారు. గవర్నర్ ఈ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం సచివాలయాన్ని తనిఖీ చేసి సి బ్బందికి సూచనలు, సలహాలిచ్చారు.