రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-30T23:34:14+05:30 IST

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీసర్వేపై నిర్లక్ష్యం వద్దని సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ బసంతకుమార్‌ పేర్కొన్నారు.

రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్‌

పెనుకొండ టౌన, డిసెంబరు 30: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీసర్వేపై నిర్లక్ష్యం వద్దని సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ బసంతకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, సర్వేఅండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ ఎండీ రామకృష్ణతో పాటు ఇతర అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. వందేళ్ల తరువాత చేపడుతున్న భూసర్వే ద్వారా భూసమస్యలు నెలకొన్న వాటిని సజావుగా పరిష్కరించాలన్నారు. స్పందనలో వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతానికిపైగా భూ సమస్యలు ఉన్నాయన్నారు. డిసెంబరు 2023నాటికి జిల్లాలోని 461గ్రామాల్లో ఈ సర్వేను పూర్తీచేయాలన్నారు. భూములకు రక్షణ కల్పిస్తూ గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ర్టేషనలు జరిగే స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Updated Date - 2022-12-30T23:34:14+05:30 IST

Read more