విజయవాడకు వెళ్లొద్దు

ABN , First Publish Date - 2022-09-22T05:07:57+05:30 IST

విజయవాడలో గురువారం జరిగే మహాధర్నాకు వెళ్లొద్దని ఉపాధ్యాయ సంఘం నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

విజయవాడకు వెళ్లొద్దు
నరసింహులుకు నోటీసు ఇస్తున్న పోలీసులు


ఉపాధ్యాయ నేతలకు పోలీసుల నోటీసులు

అనంతపురం విద్య, సెప్టెంబరు 21: విజయవాడలో గురువారం జరిగే మహాధర్నాకు వెళ్లొద్దని ఉపాధ్యాయ సంఘం నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, జిల్లా అధ్యక్షుడు వెంకటేషులు, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్‌ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులకు నోటీసులు అందించారు. ఉపాధ్యాయ సమస్యలపై వందరోజుల పోరుబాటలో భాగంగా గురువారం విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. సీపీఎస్‌ రద్దు, తరగతుల విలీనం రద్దు, టీచర్ల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లతో ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని అడ్డుకునేలా పోలీసులతో ప్రభుత్వం నోటీసులు ఇప్పించడం సరికాదని నాయకులు అన్నారు. నోటీసులు, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు.


Read more