పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

ABN , First Publish Date - 2022-09-09T05:12:30+05:30 IST

మండలంలోని ఎద్దులపల్లి గ్రామంలో ప్రా థమిక ఆరోగ్యకేంద్రంను డీఎంహెచ్‌ఓ విశ్వనాథయ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

పామిడి, సెప్టెంబరు 8: మండలంలోని ఎద్దులపల్లి గ్రామంలో ప్రా థమిక ఆరోగ్యకేంద్రంను డీఎంహెచ్‌ఓ విశ్వనాథయ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని పలు రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీలో రోగులతో వైద్య సేవలుపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాల రికార్డులను తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో వైద్య సేవలుపై సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ యుగంధర్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more