సీఎంఏ పరీక్షలో మెరిసిన ధర్మవరం విద్యార్థి

ABN , First Publish Date - 2022-09-30T04:55:53+05:30 IST

పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన పిన్ను అనిల్‌ కుమార్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ ఇంటర్‌) ఫైనల్‌ పరీక్షల్లో ఆలిండియా 21వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

సీఎంఏ పరీక్షలో మెరిసిన ధర్మవరం విద్యార్థి
అనిల్‌కుమార్‌

 ధర్మవరం, సెప్టెంబరు 29: పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన పిన్ను అనిల్‌ కుమార్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ ఇంటర్‌) ఫైనల్‌ పరీక్షల్లో ఆలిండియా 21వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. చదువుపై చిన్నప్పటి నుంచి మక్కువ అన్నారు. హార్డ్‌వర్క్‌, తల్లిదండ్రులు, స్నేహితులు అందించిన ప్రోత్సాహం వల్ల ఈ ర్యాంక్‌ను సాధించానన్నారు. సీఎంఏ పైనల్‌ పరీక్షలో 800 మార్కులకుగాను 494 మార్కులు సాధించానన్నారు. దీంతో అతడిని పట్టణ ప్రముఖులు, స్థానికులు అభినందించారు.


Read more