నేతాజీనగర్‌లో నాలుగు ఇళ్లు కూల్చివేత

ABN , First Publish Date - 2022-11-21T00:10:16+05:30 IST

నగరంలోని నేతాజీనగర్‌లో ఆదివారం నాలుగు ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్‌ సమీపంలోని పొరంబోకు భూమిలో అక్రమంగా ఇళ్లను నిర్మించారనే ఫిర్యాదుపై కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో కూల్చివేసినట్లు ఆర్‌అండ్‌బీ, ఎనహెచ, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

నేతాజీనగర్‌లో నాలుగు ఇళ్లు కూల్చివేత

అనంతపురం క్రైం, నవంబరు 20: నగరంలోని నేతాజీనగర్‌లో ఆదివారం నాలుగు ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్‌ సమీపంలోని పొరంబోకు భూమిలో అక్రమంగా ఇళ్లను నిర్మించారనే ఫిర్యాదుపై కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో కూల్చివేసినట్లు ఆర్‌అండ్‌బీ, ఎనహెచ, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఇళ్లను తొలగిస్తుండగా వాటి యజమానులు ఆందోళన చేశారు. సర్వేనెంబరు 444లో తొమ్మిది ఇళ్లు నిర్మించారు. ఇది గత కొన్నేళ్లుగా వివాదాస్పదమవుతూ వస్తోంది. ఆ ఇళ్లను తొలగించాలని కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో ఏడునెలల కిందట 9ఇళ్లకు గాను ఐదు ఇళ్లు కూల్చేశారు. మిగిలిన నాలుగు ఇళ్ల యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో కొంత కాలం స్టే ఆర్డర్‌ వచ్చింది. ఆ తరువాత మళ్లీ కూల్చివేయాలని ఆదేశాలు రావడంతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. 30 ఏళ్లుగా తాము ఇక్కడ నివాసముంటున్నామని, ఇళ్లు కూల్చి రోడ్లపై పడేస్తే ఎలా అని యజమానుల ప్రశ్నించారు. నగరపాలక సంస్థ అధికారులకు కనీసం నోటీసు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేయడం గమనార్హం.

Updated Date - 2022-11-21T00:10:16+05:30 IST

Read more