బీపీ మండల్‌ విగ్రహ దిమ్మె కూల్చడం దుర్మార్గం : టీడీపీ

ABN , First Publish Date - 2022-10-01T06:33:04+05:30 IST

గుంటూరులో బీసీ రిజర్వేషన పితామహుడు బీపీ మండ ల్‌ విగ్రహ దిమ్మెను మున్సిపల్‌ అధికారులు నిరంకుశంగా కూల్చివేశారని టీడీపీ వక్కలిగ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ పాండురంగప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీపీ మండల్‌ విగ్రహ దిమ్మె కూల్చడం దుర్మార్గం : టీడీపీ
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

రొళ్ల, సెప్టెంబరు 30: గుంటూరులో బీసీ రిజర్వేషన పితామహుడు బీపీ మండ ల్‌ విగ్రహ దిమ్మెను మున్సిపల్‌ అధికారులు నిరంకుశంగా కూల్చివేశారని టీడీపీ వక్కలిగ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ పాండురంగప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవా రం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాబోవు రోజుల్లో దౌర్జన్యాలు, కూల్చివేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌, మురళీ, శివ, నరసింహప్ప, రవి, రమేష్‌, రామన్న పాల్గొన్నారు. 


Read more