విద్యార్థులకు ఉపాధి కల్పించేలా పాఠ్యాంశాలు

ABN , First Publish Date - 2022-11-03T00:04:26+05:30 IST

డిగ్రీ పట్టాలు అందుకుబోయే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవిధంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేసినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాకమిషనర్‌ పోలాభాస్కర్‌ పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లోని నైపుణ్యాలను ఆకలింపు చేసుకునే విధంగా అధ్యాపకులు బోధించాలని ఆయన డిగ్రీ లెక్చరర్‌లకు సూచించారు.

విద్యార్థులకు ఉపాధి కల్పించేలా పాఠ్యాంశాలు
వర్చువల్‌గా మాట్లాడుతున్న విద్యా కమిషనర్‌ పోలాభాస్కర్‌

కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌

అనంతపురం సెంట్రల్‌, నవంబరు 2: డిగ్రీ పట్టాలు అందుకుబోయే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవిధంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేసినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాకమిషనర్‌ పోలాభాస్కర్‌ పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లోని నైపుణ్యాలను ఆకలింపు చేసుకునే విధంగా అధ్యాపకులు బోధించాలని ఆయన డిగ్రీ లెక్చరర్‌లకు సూచించారు. రాయలసీమ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్‌లకు నైపుణ్యాభివృద్ధి కోర్సులలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. 2 నుంచి 6వ తేదీవరకు ఆర్ట్స్‌ కళాశాల ఎకనామిక్స్‌ సెమినార్‌ హాల్లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్నిరంగాల్లో విద్యార్థులు రాణించేవిధంగా ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. ఇందులో భాగంగా ఎకనామిక్స్‌, కామర్స్‌ విభాగాల లెక్చరర్‌లకు ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌, జువాలజీ విభాగం లెక్చరర్‌లకు పౌల్ర్టీ ఫార్మింగ్‌ అంశాలపై తర్ఫీదునిచ్చేందుకు తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రోల్‌మోడల్‌గా ఉండాలి..

విని నేర్చుకోవడం కన్నా చూసి నేర్చుకోవడానికి విద్యార్థులు మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో అధ్యాపకులు విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండాలని అర్డ్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దివాకర్‌రెడ్డి తెలిపారు. ఆరు రోజుల శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న కొత్త అంశాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణా తరగతుల సమన్వయ కర్తలు ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ ఇస్తార్‌ అహమ్మద్‌, పౌల్రీ ఫార్మింగ్‌ చంద్రశేఖర్‌, పీఆర్వో కె.శ్రీధర్‌, లెక్చరర్‌లు పాల్గొన్నారు. కాగా ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులకు వసతిని కల్పించేందుకు గురువారం హాస్టళ్లను పునఃప్రారంభిస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Updated Date - 2022-11-03T00:04:28+05:30 IST