డ్రగ్స్‌ సరఫరాను అరికట్టండి

ABN , First Publish Date - 2022-12-12T23:46:14+05:30 IST

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టి యువత భవిష్యత్తును కాపాడాలని తెలుగుయువత నాయకులు డిమాండుచేశారు.

 డ్రగ్స్‌ సరఫరాను అరికట్టండి

తెలుగుయువత నాయకుల డిమాండు

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 12: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టి యువత భవిష్యత్తును కాపాడాలని తెలుగుయువత నాయకులు డిమాండుచేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ కేవీ రామకృష్ణప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి అంబు లెన్సు రమేష్‌, నియోజకవర్గ అధ్యక్షుడు ఓబుళరెడ్డి, ప్రధానకార్యదర్శి మనోహర్‌, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, అసెంబ్లీకమిటీ సభ్యు లు సుధీర్‌ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా వలన యువత పెడదోవ పడుతోందని, వాటి రవాణాను అరికట్టాలని అడిషనల్‌ ఎస్పీకీ ఫిర్యాదు చేశామన్నారు. సరియైున ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందోన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతియేటా జనవరి నెలలో జాబ్‌ క్యాలెండర్‌ విడు దల చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగనరెడ్డి యువతను మోసం చేశాడ న్నారు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి నిరుద్యోగ యువతను ఆదుకోవా లని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మధుసూదనరెడ్డి, మహేష్‌రెడ్డి, రాజేష్‌, శివప్రసాద్‌రెడ్డి, మల్లికార్జున, నారేపల్లి రామచంద్ర, బీడుపల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరం: రాష్ట్రంలో నిషేధిత గంజాయిని అక్ర మంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసు కో వాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్నూరు విజయ్‌చౌదరి కోరారు. తెలుగు యువత రాష్ట్ర కమిటీ ఆదేశాల మే రకు ఆయనతో పాటు నాయకులు సోమవారం వనటౌన ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ...గంజాయి వల్ల విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటు న్నారన్నా రు. యువత, విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుని గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి తొగట అనిల్‌, తెలుగుయువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సంగాలబాలు, నాయకులు అమరా సుధాకర్‌ నాయుడు, మిడతల యుగంధర్‌, పవనరెడ్డి, బొంత చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:46:18+05:30 IST