టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ

ABN , First Publish Date - 2022-05-24T05:40:22+05:30 IST

పట్టణంలోని ఓ స్థలం విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది.

టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ

గుత్తి, మే 23: పట్టణంలోని ఓ స్థలం విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. తాడిపత్రి రోడ్డులో నిర్మాణంలో ఉన్న అర్బన హెల్త్‌ సెంటర్‌ వద్ద వైసీపీ నాయకుడు అశ్వమారెన్న భూమి చదును చేస్తుండగా టీడీపీ వర్గీయులు రాము, ఆంజనేయులు, కంబగిరి అడ్డుకున్నారు.  చదును చేస్తున్న  ప్రాంతంలో తమ స్థలాలు ఉన్నాయని, తమ స్థలంలో ఎందుకు చదును చేస్తున్నావని ప్రశ్నించారు. వాదన పెరగడంతో వైసీపీ వర్గీయులు అశ్వమారెన్న, చిన్నమారెన్న, లక్ష్మన్న, టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో టీడీపీ వర్గీయుడు ఆంజేయులు తీవ్రంగా గాయపడగా, వైసీపీ నాయకుడు అశ్వమారెన్న, చిన్నమారెన్న, లక్ష్మన్న స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read more