స్పందనకు ఫిర్యాదులు వెల్లువ

ABN , First Publish Date - 2022-09-20T05:18:41+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

స్పందనకు ఫిర్యాదులు వెల్లువ
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జేసీ తదితరులు

అనంతపురం టౌన, సెప్టెంబరు 19: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బాధితులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన ప్రాంతం బాధితులతో సందడిగా కనిపించింది. కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ కేతనగార్గ్‌, డీఆర్‌ఓ గాయత్రీదేవి, అనసెట్‌ సీఈఓ కేశవనాయుడు, ఆర్డీఓ మధుసూదన, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి తదితరులు ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 515 మంది బాధితులు తమ వినతులను అందజేసి సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. Read more