వస్తున్నా.. మీకోసం పాదయాత్రకు పదేళ్లు

ABN , First Publish Date - 2022-10-03T06:06:28+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకా్‌షనాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో సంబరాలు చేసుకున్నారు.

వస్తున్నా.. మీకోసం పాదయాత్రకు పదేళ్లు
హైదరాబాద్‌లోని తన నివాసంలో కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు

చంద్రబాబు సమక్షంలో చంద్రదండు సభ్యుల సంబరాలు 

అనంతపురం అర్బన, అక్టోబరు 2: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా చంద్రదండు  వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకా్‌షనాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు కేక్‌  కట్‌ చేసి పాదయాత్ర అనుభవాలను నెమరువేసుకున్నారు. పాదయాత్రలో చంద్రదండు సేవలు మరువలేనివని చంద్రబాబు అభినందించినట్లు  ప్రకా్‌షనాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర చైర్మన గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ  నాయకులు కంభం పాటి రామ్మోహన, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Read more