-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Come for money Padigapu-MRGS-AndhraPradesh
-
డబ్బుల కోసం వచ్చి.. పడిగాపులు
ABN , First Publish Date - 2022-10-02T05:17:00+05:30 IST
మండలకేంద్రం లో ని ఆంధ్ర ప్రగతి గ్రామీణబ్యాంకుకు శనివారం డబ్బుల కోసం వచ్చిన మ హిళ ఖాతా దారు లు సాయంకాలం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

బత్తలపల్లి, అక్టోబరు1: మండలకేంద్రం లో ని ఆంధ్ర ప్రగతి గ్రామీణబ్యాంకుకు శనివారం డబ్బుల కోసం వచ్చిన మ హిళ ఖాతా దారు లు సాయంకాలం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొత్తగా మంజూరైన లోన్లు, చేయూత డబ్బుల కోసం మహిళసంఘాల సభ్యులు బ్యాంకు వద్దకు వచ్చారు. అయితే కంప్యూట ర్లు పనిచేయలేదని బ్యాంకు వారు తెలిపారు. దీంతో వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్నం, నీళ్లు లేకుండా బ్యాంకు వద్దే పస్తులు ఉండాల్సి వచ్చింది. సాయంకాలం 4గంటల నుంచి డబ్బులు పంపీణీ చేయడంతో అప్పుడు తీసుకుని వెళ్లిపోయారు. కనీసం బ్యాంకులో తాగేందుకు నీళ్లు కూడా ఉంచలేదని ఖాతాదారులు వాపోయారు. ఈవిషయంపై బ్యాంకు మేనేజర్ బద్రినాథ్‌ను వివరణ కోరగా ఆర్థికఅర్ధసంవత్సరం ముగింపురోజు కా వడంతో వడ్డీ, జమ, ఖర్చులు వ్యవహారం ఉన్నందున సర్వర్లు పనిచేయలేదని తెలిపారు.