కాలనీలోని బడినే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-10T05:34:25+05:30 IST

అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన ప్రభుత్వ పాఠ శాలను జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు.

కాలనీలోని బడినే కొనసాగించాలి
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీవాసులు


నంబులపూలకుంట, సెప్టెంబరు 9: అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన ప్రభుత్వ పాఠ శాలను జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని నాగలకట్ట సమీపంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహ దారిపై శుక్రవారం బైఠా యించి రాస్తారోకో నిర్వ హించారు. పిల్లలు వెళ్ల డానికి ఏ మాత్రం అను కూలంగా లేని ఉన్నత పాఠశాలకు తమ పిల్లలను పంపలేమని అన్నారు. మా పాఠశాలను అలాగే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వారి ఆందోళన విషయం తెలుసుకున్న సింగల్‌ విండో అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే ఇచ్చిన కాపీని తాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వద్దకు తీసుకె ళ్లనున్నట్లు చెప్పారు. దీంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. 


Read more