శ్రీనివాసాచార్యకు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం

ABN , First Publish Date - 2022-12-30T03:00:01+05:30 IST

దర్బశయనం శ్రీనివాసాచార్యకు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం లభించింది.

శ్రీనివాసాచార్యకు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 29: దర్బశయనం శ్రీనివాసాచార్యకు చం.స్పందన జీవన సాఫల్య పురస్కారం లభించింది. ఈ మేరకు స్పందన అనంత కవుల వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజారామ్‌, చంద్రశేఖరశాస్త్రి గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వేదిక ఆధ్వర్యంలో ఏటా వివిధ విభాగాల్లో ఉత్తమ సాహితీకారులను సత్కరిస్తున్నామని వారు పేర్కొన్నారు. 2021 సంవత్సరానికి హైదరాబాద్‌కు చెందిన దర్బశయనం శ్రీనివాసాచార్యను చం.స్పందన జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశామని ప్రకటించారు. మట్టిని తమ చెమటతో, నెత్తురుతో హరితమయం చేస్తున్న రైతుల పక్షాన దాదాపు పది కవితా సంపుటాలను వెలువరించిన శ్రీనివాసాచార్య రైతు కవిగా ప్రసిద్ధిగాంచారని అన్నారు. త్వరలో అనంతపురంలో శ్రీనివాసాచార్యకు జీవన సాఫల్య పురస్కారం, నగదు బహుమతి అందజేసి సత్కరిస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసాచార్యను జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల తెలుగురాష్ట్రాల సాహితీవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - 2022-12-30T03:00:01+05:30 IST

Read more