రోడ్డు ప్రమాదంలో ‘చిరు’ అభిమాని దుర్మరణం

ABN , First Publish Date - 2022-09-29T06:05:09+05:30 IST

మండల పరిధిలోని తలగాసిపల్లి క్రాస్‌ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరంజీవి అభిమాని వడ్డే రాజశేఖర్‌ (23) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ‘చిరు’ అభిమాని దుర్మరణం
మృతి చెందిన రాజశేఖర్‌

గార్లదిన్నె, సెప్టెంబరు 28: మండల పరిధిలోని తలగాసిపల్లి క్రాస్‌ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరంజీవి అభిమాని వడ్డే రాజశేఖర్‌ (23) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు, గుత్తి మండలం చెర్లొపల్లి గ్రామానికి గుర్రప్ప, వెంకటలక్ష్మి దంపతులు కుమారుడు రాజశేఖర్‌ తాపీమేస్ర్తీ పని చేసేవాడు. అనంతపురంలో జరిగే చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షనకు తన మిత్రుడు అభిషేక్‌తో కలసి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. తలగాసిపల్లి వద్దకు రాగానే కుక్క అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అభిషేక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read more