అటవీశాఖలో అటకెక్కిన తనిఖీలు

ABN , First Publish Date - 2022-11-16T23:58:04+05:30 IST

అటవీశాఖలో కొందరు అధికారులు తనిఖీలు చేయకుండా వసూళ్లకు దిగుతున్నారు. సామిల్లుల నుండి నెలమామూళ్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తునాయి. నూతన రేంజర్‌ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టి 4నెలలు పూర్తయినా ఇంతవరకూ ఒక్క సామిల్లు కూడా తనిఖీ చేయలేదు

అటవీశాఖలో అటకెక్కిన తనిఖీలు
జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం

సామిల్లుల నుంచి నెల మామూళ్లు!

పట్టించుకోని డీఎఫ్‌ఓ

చుట్టపుచూపుగా వస్తున్న సీసీఎఫ్‌

ఇష్టారాజ్యంగా కిందిస్థాయి సిబ్బంది వసూళ్లు

అనంతపురం న్యూటౌన: అటవీశాఖలో కొందరు అధికారులు తనిఖీలు చేయకుండా వసూళ్లకు దిగుతున్నారు. సామిల్లుల నుండి నెలమామూళ్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తునాయి. నూతన రేంజర్‌ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టి 4నెలలు పూర్తయినా ఇంతవరకూ ఒక్క సామిల్లు కూడా తనిఖీ చేయలేదు. ఇదంతా తెలిసినా డీఎఫ్‌ఓ తనకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు న్నాయి. స్థానికంగా సీసీఎఫ్‌ (చీఫ్‌కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) ఉన్నట్లయితే ఇక్కడ జరిగే ప్రతి సమస్య ఆయన దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఏదైన సమస్యలు తలెత్తితే ఇబ్బందులు తప్పవని సిబ్బంది సైతం ఎవరి జాగ్రత్తలో వారు ఉండేవారు. సీసీఎఫ్‌గా శ్రీనివాసశాస్ర్తి పదవీ విరమణ పొందడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించకుండా తిరుపతి సీసీఎఫ్‌ నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో సీసీఎఫ్‌ చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో 122 సామిల్లులు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 122 సామిల్లులు ఉన్నా యి. అనంతపురం జిల్లా పరిధిలో 76, శ్రీసత్యసాయి జిల్లాలో 46 సామిల్లులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరిలో సామిల్లుల అనుమతులు రెన్యువల్‌ చేసుకోవాలి. అయితే కొందరు అనుమతులను గాలికి వదిలేశారన్న విమర్శలు విని పిస్తున్నాయి. కొందరు కింది స్థాయి సిబ్బంది మామూళ్లు వసూలు చేసుకుని మిన్నకుండిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేంజర్లు, డీఎఫ్‌ఓ సైతం దృష్టి సారించకపోవడంతో వసూళ్లరాయుళ్లు మరింత చెలరేగిపో తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

టన్నులకొద్దీ టేకు నిల్వ

అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం జిల్లాలో చింత, వేప కలప మాత్ర మే అందుబాటులో ఉంది. ప్రస్తుతం గృహనిర్మాణాలకు వినియోగించే కలపలో ఒకటైన టేకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసు కోవాల్సిందే. కానీ జిల్లాలో ఏ సామిల్లులో చూసిన టన్నుల కొద్ది టేకు కలప కనిపి స్తోంది. నిల్వ చేసిన టేకు కలపకు నిభందనల మేరకు అనుమతులు ఉన్నా యా లేదా అన్నది అటవీశాఖ అధికారులకే తెలియాలి. సామిల్లులో నిల్వ చేసిన కలపకు సంబంధించి ఎంత కలప ఉందన్నది రికార్డులుండాలి. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు వాటిని పరిశీలించి నిబంధనల మేరకు అమలు జరుగుతుందా లేదా అన్నది పరిశీలించాలి. కొన్ని సామిల్లుల్లో రికార్డులే లేనట్లు అటవీశాఖ యంత్రాంగం చెబుతోందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

సామిల్లుల నుంచి నెలమామూళ్లు

జిల్లా కేంద్రంలో ఉన్న సామిల్లుల నుండి పెద్ద ఎత్తున నెలమామూళ్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సాధారణంగా రెంజర్‌, సెక్షన అధికారి, బీట్‌ ఆఫీసర్‌ స్థాయి సిబ్బంది తరచూ సామిల్లులు తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ ఉంచకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలి. అక్రమంగా కలప నిల్వ ఉంచితే సీజ్‌ చేయడమో లేక జరిమానా విధించడమో చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో సామిల్లుల తనిఖీని పూర్తిగా అటకెక్కించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా సామిల్లులో కలప నిల్వ చేస్తున్నట్లు సమాచారం. డీఎఫ్‌ఓ జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికి పలు సమస్యలు ఆయన దృష్టికి వెళ్లినా ఏమి పట్టనట్లు వ్వవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయన ఉదాశీనత ఆధారంగానే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా యి.

రెండు రేంజులకు ఒకే రేంజర్‌

అనంతపురం రేంజ్‌లోనే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అలాంటిది కొత్తగా వచ్చిన ఇక్కడి రేంజర్‌కు గుత్తిరేంజ్‌ ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగిం చారు. దీంతో తనిఖీలు అటకెక్కించారనే విమర్శలు వినవస్తున్నాయి. ఆఖరికి సిబ్బంది సైతం తమ పనుల పరిశీలనకు రావాలని రేంజర్‌కు విన్నవించిన తీరకలేని విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పాలనపై డీఎ్‌ఫఓ దృష్టి పెట్టకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవరిస్తూ వసూళ్లుకు దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చుట్టపుచూపుగా వచ్చే సీసీఎఫ్‌ వచ్చామా? రెండు ఫైల్స్‌లో సంతకం చేశామా? వెళ్లిపోయామా? అన్న చందంగా వ్యవహరిస్తున్నారని కొందరు సిబ్బంది వాపోతున్నారు.

అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకేనా..

ఉన్నతాధికారి చుట్టపుచూపుగా వస్తారు. అలాంటి సమయంలో సిబ్బందితో నిర్వహించే సమీక్షకు మీడియాకు సమాచారం ఇచ్చేవారు. ప్రస్తు తం ఉన్న డీఎ్‌ఫఓ వాటికి స్వస్తి చెప్పారు. జిల్లాలో నెలకొన్న ఏదైనా సమస్యను ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లి లేని పోని సమస్యలను సృష్టించుకోవడం ఎందుకని సైలెంటుగా సమీక్షలు పూర్తి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై సీసీఎఫ్‌ దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-11-16T23:58:04+05:30 IST

Read more