వెంబడించి.. వేధించి.. చంపేశాడు..

ABN , First Publish Date - 2022-08-26T05:07:47+05:30 IST

స్థానిక వీడి రోడ్డులోని జీఆర్‌ లాడ్జిలో వైద్య విద్యార్థిని అక్షితది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఆమెను వెంటవచ్చిన మహేశ వర్మ చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వెంబడించి.. వేధించి.. చంపేశాడు..
వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు

వైద్య విద్యార్థినిది హత్యే.. పరిచయస్థుడే నిందితుడు

హిందూపురం, ఆగస్టు 25: స్థానిక వీడి రోడ్డులోని జీఆర్‌ లాడ్జిలో వైద్య విద్యార్థిని అక్షితది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఆమెను వెంటవచ్చిన మహేశ వర్మ చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను హిందూపురం టూటౌన సీఐ వెంకటేశ్వర్లు గురువారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లుకు చెందిన వైద్య విద్యార్థిని అక్షితకు ఐదు నెలల క్రితం పఠానచెరువు ప్రాంతానికి చెందిన మహేష్‌ వర్మతో బస్సులో పరిచయం ఏర్పడింది. ఇనస్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసేవాడు. ఈ నేపథ్యంలో ఇనస్టాగ్రామ్‌లోని అక్షిత ఫొటోలను డౌనలోడ్‌ చేసుకుని, మార్ఫింగ్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేయడం మొదలెట్టాడు. తన కోరిక తీర్చాలని బెదిరించేవాడు. విషయాన్ని అక్షిత.. కుటుంబ సభ్యులకు చెప్పి, బాధపడింది. ఈనెల 23న సాయంత్రం జైపూర్‌ నుంచి వచ్చే రైలులో హైదరాబాద్‌ నుంచి ఆమె చదువుతున్న కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి బయల్దేరింది. ఈనెల 24న ఉదయం 10.30 గంటలకు హిందూపురం రైల్వే స్టేషనలో దిగింది. వెంటనే కుటుంబ సభ్యులకు ఫోనచేసి, మరో రెండు గంటల్లో చిక్కబళ్లాపురం చేరుకుంటానని సమాచారం కూడా ఇచ్చింది. ఆమె వెంట వచ్చిన మహేశవర్మతో కలిసి హిందూపురం పట్టణంలోని జీఆర్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను గొంతు నులిమి, హత్య చేశాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో హత్యగా తేల్చారు. అక్షిత తమ్ముడు శశాంక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు మహే్‌షవర్మ పరారీలో ఉన్నాడన్నారు.


Read more