హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు ప్రజావ్యతిరేక నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-27T05:22:13+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరుమార్పు ప్రజా వ్యతిరేక నిర్ణయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమమయ్య, జడ్పీ వైస్‌ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, టీడీపీ సీనియర్‌ నా యకుడు పణికుమార్‌ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు ప్రజావ్యతిరేక నిర్ణయం
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ నాయకులు

ధర్మవరం, సెప్టెంబరు 26: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరుమార్పు ప్రజా వ్యతిరేక నిర్ణయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమమయ్య, జడ్పీ వైస్‌ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, టీడీపీ సీనియర్‌ నా యకుడు పణికుమార్‌ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.  టీడీపీ స్థానిక కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక... అభివృద్ధి, సం క్షేమం గాలికి వదిలేసి కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శిం చారు. టీడీపీ హయాంలో ఎటువంటి వివక్ష చూపకుండా చంద్రబాబు నాయుడు పాలన సాగించారని గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్‌ పేరు  మా ర్పు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పట్టణం లో ఇటీవల టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలనుఽ ధ్వంసం చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పోలీసు లకు ఫిర్యాదు చేసినా పట్టించు కోకపోవ డం అనుమానాలకు తావిస్తోందన్నా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతు కుంట లక్ష్మన్న, గొట్లూరు శీన, పురుషోత్తంగౌడ్‌, సాహెబ్బీ, చింతపులుసుపెద్దన్న, చారుగుండ్ల ఓబుళేశు, రాళ్లపల్లి షరీఫ్‌, గోసల శ్రీరాములు, చిన్నూరు విజయ్‌చౌదరి, అనిల్‌కుమార్‌, కేశగాళ్ల శ్రీనివాసులు, జంగం నరసింహులు, తోటవాసుదేవ, రామకృష్ణ పాల్గొన్నారు.

Read more