జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు

ABN , First Publish Date - 2022-09-29T06:04:06+05:30 IST

మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, మరో 36 మందిపై కేసు నమోదు చేశామని సీఐ ఆనంద్‌రావు తెలిపారు.

జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు

మరో 36 మందిపై కూడా..

తాడిపత్రి, సెప్టెంబరు 28: మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, మరో 36 మందిపై కేసు నమోదు చేశామని సీఐ ఆనంద్‌రావు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్లపై జరిగిన దాడులను నిరసిస్తూ మంగళవారం జేసీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పట్టణ పోలీ్‌సస్టేషన ఎదుట బైఠాయించారు. తమ అనుమతి లేకుండా మౌన ప్రదర్శన చేయడం, విధులకు ఆటంకం కలించారన్న కారణంతో ప్రాథమికంగా  37 మందిపై కేసు నమోదు చేశామని సీఐ అన్నారు. మరికొందరి పేర్లను చేరుస్తానమని, వారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.

Read more