పోస్టులకు అభ్యర్థులు కరువు

ABN , First Publish Date - 2022-03-16T06:07:01+05:30 IST

జిల్లా సర్వజనాస్పత్రిలో కాంట్రాక్టు పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు కరువయ్యారు.

పోస్టులకు అభ్యర్థులు కరువు

వాక్‌ఇన ఇంటర్వ్యూలో ఒక్కరికే అర్హత 

 సర్వజనాస్పత్రి పోస్టుల ఎంపికలో వింత

అనంతపురం టౌన, మార్చి 15: జిల్లా సర్వజనాస్పత్రిలో కాంట్రాక్టు పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు కరువయ్యారు. మంగళవారం నిర్వహించిన వాక్‌ ఇన ఇంటర్వ్యూల్లో ఒక్కరే అర్హత సాధించారు. మొత్తం 19 పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానించగా.. 30 మంది వరకు వచ్చారు. అర్హత ఉన్న వారు మాత్రం కనిపించలేదు. ఒకవేళ అర్హత ఉన్నా, మహిళా పోస్టులకు పురుష అభ్యర్థులు వచ్చా రు. దీంతో అందరినీ తిరస్కరించారు. థియేటర్‌ అసిస్టెంట్‌కు ఒకేఒక్కరు అర్హత సాధించారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లీశ్వరి తెలిపారు.

Read more