ప్రశాంతంగా గ్రూప్‌-4 పరీక్ష

ABN , First Publish Date - 2022-08-01T06:05:43+05:30 IST

ఏపీపీఎస్సీ నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది

ప్రశాంతంగా గ్రూప్‌-4 పరీక్ష
ఎస్‌ఎస్‌బీఎన కాలేజీలో పరీక్ష రాసేందుకు వెళుతున్న అభ్యర్థులు

12,409 మంది హాజరు

అనంతపురం టౌన జూలై 31: ఏపీపీఎస్సీ నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం అనంతపురం జిల్లాలో 60 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 19,900 మంది అభ్యర్థులకు గాను 12,409 మంది హాజర య్యారు. 7491 మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి, డీఆర్‌ఓ గాయత్రిదేవి తెలిపారు. పరీక్ష రాయడానికి తరలివచ్చిన అభ్యర్థులతో పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 9 గంటల నుంచే సందడి కనిపించింది. చంటిపిల్లలతో కూడా తల్లులు పరీక్షలకు హాజరయ్యారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు పరీక్షలు కొనసాగాయి. మొత్తం మీద ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. 

Read more