అనుగ్రహించు అమ్మా..!

ABN , First Publish Date - 2022-09-28T06:04:11+05:30 IST

దసరా నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు మంగళవారం అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు.

అనుగ్రహించు అమ్మా..!
పాతూరు అమ్మవారిశాలలో..

బాలాత్రిపుర  సుందరిగా దుర్గమ్మ

దసరా నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు మంగళవారం అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతపురం గుల్జార్‌ పేటలోని కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతను కమ్మలతో అలంకరించారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులకు కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అలంకరణ చేశారు. పాతూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని బటన రోజాలతో అలంకరించారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తిని గాయత్రిదేవిగా అలంకరించారు. కమలానగర్‌ రఘువీరా టవర్స్‌ క్రాసు వద్ద అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. బెంగుళూరు రోడ్డులోని శివకోటి ఆలయంలో అమ్మవారిని శాకంబరి, శివకోటిమాతగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.

- అనంతపురం కల్చరల్‌


Read more