భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-09-22T05:11:05+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎ్‌సఆర్‌ యూనివర్సిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు.

భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
హిందూపురంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో మోకాళ్లపై నిలబడి, నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు


ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 

పేరు మార్పుపై జిల్లావ్యాప్తంగా ఆందోళనలు


పుట్టపర్తి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎ్‌సఆర్‌ యూనివర్సిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. బుఽధవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్‌ పేరు మారిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.  ముఖ్యమంత్రి జగనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెనుకొండలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో నాయకులు.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ తీరుపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. హిందూపురంలో ఎన్టీఆర్‌ నాలుగు సింహాల సర్కిల్‌లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, రామాంజినమ్మ, షఫీవుల్లా, పట్టణాధ్యక్షుడు డీఈ రమేష్‌, నాయకులు అమర్‌నాథ్‌, చంద్రమోహన, హెచఎం రాము, కౌన్సిలర్‌ రాఘవేంద్ర, కార్యకర్తలు మోకాళ్లపై నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. కదిరిలో టీడీపీ నాయకులు.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

Read more