అధ్వాన రహదారులు.. ప్రయాణం భారం

ABN , First Publish Date - 2022-10-04T05:16:37+05:30 IST

అసలే ఎగుడుదిగుడు రహదారులు... అవి ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి.

అధ్వాన రహదారులు.. ప్రయాణం భారం
వర్షాల దెబ్బకు అధ్వానంగా తయారైన నల్లగుట్లపల్లి ర హదారి


్లఓబుళదేవరచెరువు, అక్టోబరు 3: అసలే ఎగుడుదిగుడు రహదారులు... అవి ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. ప్రధానంగా మండలంలోని కదిరి -  హిందూ పురం ప్రధాన రహదారి చాలా చోట్ల గుంతలమయంగా మారింది. ఇటీవలి కాలంలో ఆర్‌అండ్‌డీ అధికారులు రోడ్లపై గుంతల పడిన స్థానాల్లో మరమ్మ తులు చేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు యఽథాస్థితికి చేరింది. దీంతో ప్రయాణికుల ప్రయాణం యథా స్థితిలో  భారంగా సాగుతోంది. రాత్రి స మయంలో ద్విచక్రవాహన దారులు ఆద మరచి ప్రయాణించిన వారు ప్రమాదాల పడుతున్నారు. ఇటీవల మండలంలోని వడ్డివారిపల్లి, మండలకేంద్రంలోని ప్రఽ దాన రహదారి, మహమ్మదాబాద్‌క్రాస్‌ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి కిందపడి ప్రమాదాలకు గురైనా సంఘటన లు చోటు చేసుకున్నాయి. ఓడీసీ నుంచి నల్లగుట్లపల్లికి వెళ్లే రహదారి మరింత అధ్వానంగా మారింది. నారప్పగారిపల్లి క్రాస్‌నుంచి నల్లగుట్ట పల్లికి వెళ్లే రహదారి ఎగుడుదిగుడుగా మారింది. ఈ రహదారిపై ప్రమాదాలు చాలా జరిగిన సంఘటనలున్నాయి. నారప్పగారిపల్లి నుంచి నల్లగుట్లపల్లికి వెళ్లాలంటే గతంలో 15నిమిషాలు పట్టేది. ప్రస్తుతం అరగంట పడుతోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేసి, ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 


Read more