ఉద్యోగ, ఉపాధ్యాయులపై నిరంకుశత్వం వీడాలి

ABN , First Publish Date - 2022-12-12T23:52:16+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిరంకుశ ధో రణి విడనాడాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పేర్కొన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులపై  నిరంకుశత్వం వీడాలి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత

పెనుకొండ, డిసెంబరు 12: ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిరంకుశ ధో రణి విడనాడాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పేర్కొన్నారు. సోమవారం స్థానికంగా ఆమె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థి తి బాగుందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ తేదీ అయినా జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు కచ్చితంగా పడేవన్నారు. అసమర్థ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఢిల్లీలో అప్పుదొరికితే తప్ప ఏపీలో జీతాలు ఉండవన్నారు. ఏపీలో ఆర్థిక శాఖ మంత్రి అనే పదవిలేదని, ప్రస్తుతం ఉన్నది కేవలం అ ప్పులశాఖ మంత్రి మాత్రమేనన్నారు. 12వ తేదీ వస్తున్నా జీతాలు రాక ఉద్యోగులు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కోసం కొద్దిగా అప్పు చేస్తే నానా హంగామా చేసిన ప్రస్తుత ఆ ర్థిక మంత్రి, ఇప్పుడు సిగ్గులేకుండా నిక్కచ్చిగా జగన చేస్తున్న అప్పులను సమర్థిస్తున్నాడన్నారు. ఒకవైపు బదిలీల జీఓ ఇస్తూ, మరోవైపు సర్దుబాటు ఉత్తర్వులు ఇస్తార ని, ఏం జరుగుతోందన్నది అయోమయంలో పెట్టి జీతాలు అడగకుండా డైవర్షన రాజకీయాలు చేస్తున్న జగన్మోహనరెడ్డికి రానున్న ఎన్నికల్లో ఉద్యోగులే తగిన రీతిలో బుద్ది చెబతారన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ ఈశ్వర్‌ ప్రసాద్‌, త్రివేంద్రనాయుడు, కౌన్సిలర్‌ గీత హనుమంతు, కోనాపురం కేశవయ్య, బాలు, నాగార్జున పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:52:16+05:30 IST

Read more