ఆటో బోల్తా: ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-10-08T05:35:54+05:30 IST

మండలంలోని జక్కల చెరువులోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తాపడి లక్ష్మిదేవి (63) మృతి చెం దింది. మరో ఎనిమిది మంది మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

ఆటో బోల్తా: ఒకరి మృతి
లక్ష్మీదేవి మృతదేహం


ఎనిమిది మంది మహిళా కూలీలకు గాయాలు

గుత్తి రూరల్‌, అక్టోబరు 7: మండలంలోని జక్కల చెరువులోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తాపడి లక్ష్మిదేవి (63) మృతి చెం దింది. మరో ఎనిమిది మంది మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీ సులు తెలిపిన మేరకు.. గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన పదిమంది కూలీలు పెద్దవడుగూరు మండలంలోని తిమ్మాపురానికి మిరపకాయలను కోయడా నికి ఆటోలో బయల్దేరారు. జక్కలచెరువులోకి రాగానే కుక్క అడ్డంరావడంతో దాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మిదేవి, పుల్లమ్మ, జరీనా, కళ, పద్మావతి, లక్ష్మి, శివలక్ష్మి, గంగాదేవి, లత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు లక్ష్మిదేవి మృతి చెందింది. పుల్లమ్మ, గంగాదేవిలను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read more