ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

ABN , First Publish Date - 2022-11-21T00:03:58+05:30 IST

మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ఆదివారం ఆర్టీసీ డ్రైవర్‌ రామచంద్ర, కండక్టర్‌ ఇంతియాజ్‌లపై అదే గ్రామానికి చెందిన ఉపేంద్ర, లడ్డులు దాడిచేసి గాయపరిచారని పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

తాడిపత్రిటౌన, నవంబరు 20: మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ఆదివారం ఆర్టీసీ డ్రైవర్‌ రామచంద్ర, కండక్టర్‌ ఇంతియాజ్‌లపై అదే గ్రామానికి చెందిన ఉపేంద్ర, లడ్డులు దాడిచేసి గాయపరిచారని పోలీసులు తెలిపారు. తాడిపత్రి నుంచి గుత్తికి వెళుతుండగా బస్సు పోవడం వల్ల దుమ్ము,ధూళి ఇళ్లలోకి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ డ్రైవర్‌, కండక్టర్లపై దాడికి దిగారు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడ్డ రామచంద్రను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-11-21T00:03:58+05:30 IST

Read more