అశ్మిత్‌పై దాడి పిరికిపంద చర్య: టీఎనఎస్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2022-11-24T23:51:27+05:30 IST

తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేసీ అశ్మిత్‌రెడ్డిపై దాడి చేయడం వైసీపీ గూండాల పిరికిపంద చర్య అని టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు.

అశ్మిత్‌పై దాడి పిరికిపంద చర్య: టీఎనఎస్‌ఎఫ్‌

అనంతపురం విద్య, నవంబరు 24: తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేసీ అశ్మిత్‌రెడ్డిపై దాడి చేయడం వైసీపీ గూండాల పిరికిపంద చర్య అని టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. అశ్మిత్‌పై రాళ్ల దాడిని ఖండిస్తూ గురువారం టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రిలో 3వ వార్డులో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అశ్మిత్‌రెడ్డి పర్యటిస్తుంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రోద్బలంతో కొందరు వైసీపీ నేతలు, అల్లరిమూకలు రాళ్ల దాడికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. తాడిపత్రి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రవర్తిస్తుండటం వైసీపీ దౌర్జన్యాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బీసీసాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్‌ నారాయణస్వామి, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నేతలు గంగాధర్‌, జిల్లా కార్యదర్శి శివకుమార్‌, మైనార్టీ సెల్‌ జిల్లా కార్యదర్శి జిలాన్‌ బాషా, షంషేర్‌, హరీష్‌, శ్రీనివాసులు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:51:27+05:30 IST

Read more