‘టీడీపీ సభ్యత్వంతో భరోసా’

ABN , First Publish Date - 2022-07-18T06:07:25+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సభ్యత్వ నమోదు చేయించుకోవడం ద్వారా వారికి భరోసా లభిస్తుందని టీడీపీ మండల కన్వీనర్‌ కూచి రాము అన్నారు.

‘టీడీపీ సభ్యత్వంతో భరోసా’
సభ్యత్వ నమోదులో పాల్గొన్న టీడీపీ నాయకులు

తాడిమర్రి, జూలై 17: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సభ్యత్వ నమోదు చేయించుకోవడం ద్వారా వారికి భరోసా లభిస్తుందని టీడీపీ మండల కన్వీనర్‌  కూచి రాము అన్నారు.  తాడిమర్రిలో ఆదివారం టీడీపీ నాయకుడు  ముంటిమడుగు హర్ష ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 130 మందికి పాత సభ్యత్వాలను పునరుద్ధరించారు. కొత్తగా సభ్యత్వం నమోదు చేయడానికి ప్రయత్నించగా సర్వర్‌ పనిచేయకపోవడంతో పలువురు వెనక్కిపోయారు. స్థానిక నాయకులతో కన్వీనర్‌ మాట్లాడుతూ... ప్రతి కార్యకర్తకు సభ్యత్వ నమోదు చేయించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాఽధ్యత మీపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు, బీసీసెల్‌ మండల నాయకుడు భాస్కర్‌గౌడ్‌, రామానాయుడు,  గణేశ; సుధాకర్‌,  సాంబ, గంగప్ప, చలపతి, దుర్గప్ప  తదితరులు పాల్గొన్నారు.

Read more