ఉద్యోగుల సర్వీస్‌ వివరాలు ఆరా

ABN , First Publish Date - 2022-12-10T00:22:34+05:30 IST

ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఓ రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక తమను వేధిస్తు న్నారని అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎ్‌సపై చేతులెత్తేశారని, పీఆర్‌సీ విషయంలోనూ ఏవేవో మెలిక పెట్టి ముందు ఇచ్చిన ఐఆర్‌ను కూడా తగ్గించి ఫిట్‌మెంట్‌ ఇచ్చారని వారు గుర్రుగా ఉన్నారు. తాజాగా ఉద్యోగుల సర్వీస్‌ వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఉద్యోగుల సర్వీస్‌ వివరాలు ఆరా
జిల్లా ఖజానా కార్యాలయం

25ఏళ్లు పూర్తయిన వారి వివరాల సేకరణ

జీతాల బిల్లుతో సర్వీస్‌ జత చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో మరో టెన్షన

అనంతపురం టౌన, డిసెంబరు 9: ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఓ రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక తమను వేధిస్తు న్నారని అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎ్‌సపై చేతులెత్తేశారని, పీఆర్‌సీ విషయంలోనూ ఏవేవో మెలిక పెట్టి ముందు ఇచ్చిన ఐఆర్‌ను కూడా తగ్గించి ఫిట్‌మెంట్‌ ఇచ్చారని వారు గుర్రుగా ఉన్నారు. తాజాగా ఉద్యోగుల సర్వీస్‌ వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 25ఏళ్ల సర్వీస్‌ పూర్తయిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. జీతాల బిల్లులతో పాటు సర్వీస్‌ సర్టిఫికెట్లు కూడా జత చేసి పంపాలని రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్‌ మెమో జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోనూ ట్రెజరీ శాఖల అధికారులు ఉద్యోగ, ఉపాధ్యాయుల 25ఏళ్ల సర్వీస్‌ పూర్తయిన వారి వివరాలు పంపాలని అన్ని శాఖల డీడీఓలకు ఆదేశాలు పంపారు. ఆ మేరకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, డీడీఓలు సర్వీస్‌ వివరాలను సేకరించి పంపుతున్నారు. కాగా, సర్వీస్‌ వివరాలు సేకరిస్తుండటం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో చర్చకు దారి తీస్తోంది. టీడీపీ పాలనలో ఉద్యోగ విరమణ వయసును 58ఏళ్ల నుంచి 60ఏళ్లకు పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని 62ఏళ్లకు పెంచారు. ఈ పెంపుపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పెద్దగా హర్షించ లేదు. తమకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని నిరుద్యోగులు ముఖ్య మంత్రి జగన నిర్ణయాలపై తీవ్రంగా మండిపడుతూ వస్తున్నారు. ఇప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదని వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుర్రుమంటున్నారు. 62ఏళ్ల వయసు లేదా 30 ఏళ్ల సర్వీస్‌ నిబంధన పెట్టి సీనియర్‌లను ముందుగానే ఇంటికి సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ సాగుతోంది. అయితే ట్రెజరీ అధికారులు మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ సమాచారం పక్కాగా తెలుసుకునేందుకే వారి వివరాలను సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఏ సంవత్సరం ఎంత మంది ఉద్యోగ విరమణ పొందుతారు వారికి అవసరమైన రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ నిధులు ఎంత అనేది ముందుగానే తెలుసుకొని కేటాయించడానికి అవకాశముంటుందని ఆ మేరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడా తీసుకొస్తున్నట్లు ఖజానా అధికారులు అంటున్నారు. కానీ వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో సర్వీస్‌ వివరా లు సేకరణతో ముఖ్యమంత్రి మదిలో ఏముందోనని టెన్షన పడుతున్నారు.

Updated Date - 2022-12-10T00:22:35+05:30 IST