నారా లోకేశ అరెస్టు హేయం

ABN , First Publish Date - 2022-08-22T05:13:04+05:30 IST

పలాసకు వెళ్లకుండా నారా లోకేశ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలుగు యువత నాయకులు సీఎం జగన, మంత్రి అప్పలరాజు ఫొటోలను దహనం చేశారు.

నారా లోకేశ అరెస్టు హేయం
సీఎం జగన, మంత్రి అప్పలరాజు ఫొటోలను దహనం చేస్తున్న తెలుగు యువత నాయకులు

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి

సీఎం జగన, మంత్రి అప్పలరాజు ఫొటోలు దహనం  

 అనంతపురం అర్బన, ఆగస్టు 21 : పలాసకు వెళ్లకుండా నారా లోకేశ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలుగు యువత నాయకులు సీఎం జగన, మంత్రి అప్పలరాజు ఫొటోలను దహనం చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక గుత్తి రోడ్డు లో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడుపూటి నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ... పలాసకు వెళ్లకుండా నారా లోకేశను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. లోకేశ అంటేనే సీఎం జగన, వైసీపీ నాయకులకు మొదటి నుంచి భయమన్నారు. లోకేశ ను అడ్డుకోవడం మంత్రి అప్పలరాజు అసమర్థతకు నిదర్శన మని మండిపడ్డారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అనీ, మంత్రి అక్రమాలపై విచారణ చేయించి ఆయనను అరెస్టు చేయించడం ఖాయమని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో తెలుగు యు వత నాయకులు బొమ్మినేని శివ, మద్దినేని కృష్ణ, మురళీ, రమణ, వెంకట్‌ పాల్గొన్నారు. 

Read more