తెలుగు రైతు విభాగం నాయకుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-09-19T06:04:51+05:30 IST

రైతు సమస్యల పరిష్కారం కోసం తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో సోమవారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

తెలుగు రైతు విభాగం నాయకుల అరెస్ట్‌
నాలుగో పట్టణ పోలీస్‌స్టేషనలో రాయల్‌ మురళికి నోటీస్‌ అందజేస్తున్న ఎస్‌ఐ

చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఆటంకాలు

అనంతపురం అర్బన, సెప్టెంబరు 18: రైతు సమస్యల పరిష్కారం కోసం తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో సోమవారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో ఆదివారం ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం నగరంలో  తెలుగు రైతు విభా గం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాయల్‌ మురళి, జిల్లా ఉపాధ్యక్షుడు రఘునాథరెడ్డిలను స్థానిక పోలీసులు అరెస్టు చేసి నోటీసులు జారీ చేశారు. రాయదుర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, తాడిపత్రిలో జిల్లా కార్యదర్శి యుగంధర్‌లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 


 రైతులను విస్మరిస్తే పతనమే

పామిడి: రైతులను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి టీడీపీ పిలుపునివ్వడంతో విజయవాడకు బయలుదేరుతున్న టీడీపీ నాయకులను పోలీసులు ఆదివారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైతే రైతు సమస్యలను పరిష్కరించాలని, ఇలా ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని విరుచుకుపడ్డారు. సీఐ ఈరన్న వారికి నోటీసులు అందజేసి విడుదల చేశారు. అరెస్టైన వారిలో లక్ష్మీనారాయణరెడ్డి పాటు, టీడీపీ బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జింకల రామకృష్ణ, వడ్డే శివకుమార్‌, మాజీ కౌన్సిలర్‌ రమణారావు ఉన్నారు. 


రైల్వే స్టేషనలో అరెస్ట్‌

అనంతపురంరూరల్‌: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి విజయవాడకు వెళుతున్న తెలుగు రైతు విభాగం నాయకులను ఆదివారం రాత్రి పోలీసులు రైల్వేస్టేషనలో అరెస్ట్‌ చేశారు. సోమవారం రైతు సమస్యలపై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈక్రమంలోనే తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రఘునాథ్‌, రాప్తాడు తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు కురుగుంట నారాయణ స్వామి, టీఎనఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల లోకేష్‌ యాదవ్‌ విజయవాడకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైల్వేస్టేషనలో వారిని అరెస్టు చేశారు. పోలీస్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అనిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు, రైతులు ప్రభుత్వానికి బుద్ధిచెప్పేరోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. 


పిచ్చికూతలు మానుకో.. 

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిపై పరిటాల శ్రీరామ్‌ ఫైర్‌ 

అనంతపురం అర్బన, సెప్టెంబరు 18: నారాలోకేష్‌, పరిటాల కుటుంబంపై పిచ్చికూతలు కూయ డం మానుకోకపోతే రాప్తాడు నియోజకవర్గ ప్రజలు సహించరని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం అనంతపురం నగరంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికలకు ముందు ఇంటిని అమ్ముకునే స్థాయి నుంచి ప్రస్తుతం కోట్లాది రూపాయలు కూడబెట్టుకొని అభివృద్ధి చెందారని ప్రజలే చెప్పుకుంటున్నారన్నారు. దొంగ ఓట్లతో గెలిచి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పరిటాల కుటుంబం, నారాలోకే్‌షపై విమర్శలు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారన్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగలేదని, తోపుదుర్తి కుటుం బం మాత్రమే ఆర్థికంగా అభివృద్ధి చెందిందని ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే హోదాలో తన తండ్రి బెట్టింగ్‌లతో గెలిచిన డబ్బులతో ప్లాట్లు కొన్నారని బహిరంగంగానే ప్రకటించడం సిగ్గుచేటన్నారు. పరిటాల కుటుంబ చరిత్ర చెప్పాలంటే రోజులు సరిపోవని, ప్రజా సమస్యలపై పోరాడేందుకు నిత్యం ప్రజల మధ్య ధైర్యంగా తాము  తిరుగుతున్నామన్నారు. నీలాగా ఓడిపోయినప్పుడు ప్రజలకు దూరంగా పారిపోలేదన్నారు. మీ సొంత గ్రామంలో రోడ్ల దుస్థితిని చూస్తేనే ఎలాంటి అభివృద్ధి చేశావో అర్థమవుతోందన్నారు. 


Read more