ఎస్పీ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

ABN , First Publish Date - 2022-10-05T04:22:10+05:30 IST

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించా రు.

ఎస్పీ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ
వాహన పూజలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌పుట్టపర్తి రూరల్‌, అక్టోబరు 4: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించా రు. మంగళవారం దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ చేపట్టారు. దుర్గాదేవి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌, ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, ఏఆర్‌ ఆడ్మిన, ఆర్‌ఐ టైటా్‌స, ఎంటీఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్పందనకు 11 ఫిర్యాదులు :  జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్పందనలో 11 ఫిర్యాదులు వచ్చాయి. చట్టపరంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశించారు. 


Read more