పాడి రైతులకు ప్రోత్సాహం ఏదీ?

ABN , First Publish Date - 2022-03-04T06:03:00+05:30 IST

పాడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైం ది. రాయితీల ఊసే లేకుండా పోయింది. పాల ధరలు గిట్టుబాటు కాక పాడిపోషణ భారమైంది.

పాడి రైతులకు ప్రోత్సాహం ఏదీ?
మూతపడిన ప్రభుత్వ పాల సమీకరణ కేంద్రం

రెండింతలు పెరిగిన దాణా, గడ్డి ధరలు 

పాల కొనుగోలుకు ముందుకురాని ప్రభుత్వం

ప్రైవేట్‌ డెయిరీ నిర్వాహకుల ఇష్టారాజ్యం


పరిగి, మార్చి 3: పాడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైం ది. రాయితీల ఊసే లేకుండా పోయింది. పాల ధరలు గిట్టుబాటు కాక పాడిపోషణ భారమైంది. మండలంలోని కాలువపల్లి పాడిపరిశ్రమకు పెట్టింది పేరు. గ్రామంలో ఏకంగా 450 మందికిపైగా రై తులు పాడిపశువులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇటీవ ల కురిసిన భారీ వర్షాల పాడిరైతులను దెబ్బకొట్టాయి. మేత పూ ర్తిగా తడిసి పశుగ్రాసానికి పనికిరాకుండా పోయింది. దీంతో పశువులకు మేత లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొంతమంది బోరుబావులున్న రైతులు గడ్డి పెం చుకుని పాడి ఆవులను పోషిస్తూ పాలను విక్రయిస్తున్నారు. సొం త పొలాలు లేనివారు ఇతర ప్రాంతాల నుంచి గడ్డి కొనుగోలు చే యాల్సి వస్తోంది. ట్రాక్టర్‌ గడ్డి రూ.5 వేల నుంచి రూ.6 వేల వర కు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈపరిస్థితుల్లో పాడి ఆవులను పో షించుకోలేని దుస్థితి ఎదురవుతోంది.


మూడేళ్లుగా తెరుచుకోని పాలశీతలీకరణ కేంద్రం

మండలంలో ప్రభుత్వ పాలశీతలీకరణ కేంద్రాలు మూతబడి సు మారు మూడేళ్లు అవుతోంది. దీంతో ప్రైవేట్‌ డెయిరీల నిర్వాహకులు రైతుల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నారు. వేసవికాలం మొదలుకావడంతో ఎండ వేడిమికి పాలలోని ఫ్యాట్‌, ఎస్‌ఎనఎ్‌ఫ మోతా దును గుర్తించి, లీటరుకు రూ.22 చెల్లిస్తున్నారు. పశువుల దాణా ధ రలు ఒకటికి రెండింతలు పెరిగాయి. 50 కిలోల దాణా గతంలో రూ.750 ఉండగా ప్రస్తుతం రూ.1300 పలుకుతోంది. శనగచెక్క రూ.900 నుండి రూ.1600కు పెరిగిందన్నారు. గత ప్రభుత్వ హ యాంలో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.750 డీడీ రూపంలో చెల్లిస్తే గడ్డి నేరుగా ఇళ్లవద్దకు సరఫరా చేసేవారు. దాణాకు సైతం సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం పాడి రైతులకు ఎలాంటి రాయితీలు కల్పించలేదు. పాల ధర గిట్టుబాటు కాక, పాడిపశువులను విక్రయించి కూలీకి వెళ్లడమే మేలనిపిస్తుందని రైతులు వాపోతున్నారు.  


గిట్టుబాటు ధర కల్పించాలి 

- తిమ్మయ్య, కాలువపల్లి 

మాకుటుంబం పశువులను పోషించుకుం టూ జీవనం సాగిస్తు న్నాం. రెండు పాడి ఆ వులను పోషిస్తున్నా. ఇ ద్దరం రోజంతా కష్టపడి తే రూ.600 కూడా రా దు. పాలకు గిట్టుబాటు ధర కల్పిస్తే కొంతైనా ఊరట కలుగుతుంది. 

పాలు విక్రయించి పిల్లల్ని చదివిస్తున్నా 

 - నాగభూషణం, కాలువపల్లి 

40 ఏళ్లుగా పాడిపశువులను పోషిస్తున్నాం. పాలు విక్రయించి వచ్చే డబ్బుతో నా ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నా. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీతో దాణా, గడ్డి సరఫరా చేసేవారు. ప్రస్తుతం రూ.10వేలు ఇచ్చి రెండు ట్రాక్టర్ల మొక్కజొన్న గడ్డిని కొనుగోలు చేశా. ప్రభుత్వం దాణా, గడ్డికి రాయితీ ఇచ్చి పాల ధరను పెంచాలి. 

          


Updated Date - 2022-03-04T06:03:00+05:30 IST