కోతలపై ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-05T06:31:10+05:30 IST

వ్యవసాయ విద్యుత కోతలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. పలు ప్రాం తాలలో రైతులు సబ్‌ స్టేషన్లను ముట్టడించారు.

కోతలపై ఆగ్రహం
విద్యుత సబ్‌స్టేషనను ముట్టడించిన రైతులువిద్యుత సబ్‌స్టేషన్ల ముట్టడి

గుమ్మఘట్టలో కాలవ బైఠాయింపు

రోటరీపురం వద్ద వైసీపీవారు కూడా..

బుక్కరాయసముద్రం/ గుమ్మఘట్ట, ఏప్రిల్‌ 4: వ్యవసాయ విద్యుత కోతలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. పలు ప్రాం తాలలో రైతులు సబ్‌ స్టేషన్లను ముట్టడించారు. గుమ్మఘట్ట మండ లం కేపీ దొడ్డి సబ్‌ స్టేషన ఎదుట మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు నేతృత్వంలో రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత కోతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలదాకా సబ్‌ స్టేషన కార్యకలాపాలను నిలిపివేశారు. విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, దీనికితోడు లో ఓల్టేజీతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై విద్యుత శాఖ ఇనచార్జి ఏఈ బాలుతో కాలవ మాట్లాడారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అక్కడే బైఠాయించారు. డీఈ వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో కళ్యాణదుర్గంలో ఉన్న డీఈ సబ్‌ స్టేషనకు వచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జ్‌ కాలవ సన్నణ్ణ, ఎంపీపీ గిరిమల్లప్ప, నాయకులు నాగరాజు, సర్పంచ నాగరాజు, మాజీ సర్పంచ రంగస్వామి, గంగాధర, మోహనరంగ, రంగసముద్రం సర్పంచ చంద్రశేఖర్‌ రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. 


వైసీపీవారు కూడా..

బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం విద్యుత సబ్‌స్టేషనను రైతులు, వైసీపీ నాయకులు సోమవారం ముట్టడించారు. కొర్రపాడు, రోటరీపురం, చెదల్ల, నీలారెడ్డిపల్లి గ్రామాల నుంచి రైతులు సబ్‌స్టేషన వద్దకు చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. పగటి పూట తమకు 9 గంటల విద్యుత సరఫరా ఉండేదని, ప్రస్తుతం నిరంతరంగా రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని ట్రాన్సకో ఏఈ ప్రతా్‌పను రైతులు నిలదీశారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం  చేశారు. ప్రస్తుతం విద్యుత వినియోగం ఎక్కువగా ఉన్నందుకే కోతలు విధిస్తున్నామని, ఇకపై కోతలు లేకుండా చూస్తామని ఏఈ హామీ ఇచ్చారు. సీఐ రాము రైతులకు నచ్చజెప్పారు. ఆందోళనలో మాజీ ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ రాధామనోహర్‌రెడ్డి, చెదల్ల సర్పంచ శ్రీనివాసులరెఎడ్డి, కొర్రపాడు ఉప సర్పంచ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.Read more