AP News: తాడిపత్రిలో భారీగా మోహరించిన పోలీసుల

ABN , First Publish Date - 2022-10-06T15:55:33+05:30 IST

అనంతపురం (Anantapuram): తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.

AP News: తాడిపత్రిలో భారీగా మోహరించిన పోలీసుల

అనంతపురం (Anantapuram): తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎస్పీ పకీరప్ప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మునిసిపల్ కాలనీలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటును చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటును నిరసిస్తూ మూడు రోజుల క్రితం  జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. మున్సిపల్ తీర్మానం లేకుండా ఏ విధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపడతారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వివాదం నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more