అనంతలో మారని పోలీసుల తీరు

ABN , First Publish Date - 2022-03-16T18:04:43+05:30 IST

అనంతలో పోలీసుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.

అనంతలో మారని పోలీసుల తీరు

అనంతపురం: అనంతలో పోలీసుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. నెల రోజుల క్రితం ఇంటి స్థలం వివాదంలో చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు వెంకట రాముడుని ఎస్సై శ్రీధర్ చితకబాదాడు. గంగినే పల్లికి చెందిన వృద్ధుడు వెంకట్రాముడిపై పోలీసుల దాడి పట్ల హెచ్చార్సీ తీవ్రంగా స్పందించింది. అడిషనల్ ఎస్పీతో విచారణ చేయించి ఏప్రిల్ 6న నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో వెంకట్రాముడితో ఖాళీ పేపర్లపై చెన్నేకొత్తపల్లి పోలీసులు సంతకాలు చేయించుకున్నారు. విచారణకు ముందే వెంకట్రాముడిని పోలీసులు బెదిరించి సంతకాలు చేయించుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

Read more